Bodhan: కిరాణా వ్యాపారిపై బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం

Bodhan: బాకీ డబ్బులు అడిగితే చివాట్లు పెట్టిన ఎమ్మెల్యే షకీల్‌

Sandeep Eggoju
Updated on: 25 March 2021 2:03 PM IST
Bodhan MLA Shakeel Cheats Grocery Merchant And Harassed him
X

బోధన్ ఏంమ్మెల్యే షకీల్(ఫైల్ ఇమేజ్)

Bodhan: నిజామాబా‌‌ద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ మరోసారి నోరు జారాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులను కిరాణా వ్యాపారి అడగటంతో ఆగ్రహం ఊగిపోయిన ఎమ్మెల్యే షకీల్‌.. కిరాణా వ్యాపారిపై బూతు పురాణం మొదలెట్టాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం MIM మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యున్ని తిట్టిన ఘటన మరువకముందే.. ఎమ్మెల్యేకు చెందిన మరో బూతు పురాణం ఆడియో, సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుండటం గులాబీ పార్టీలో చర్చకు దారి తీసింది.

నాలుగేళ్ల క్రితం రంజాన్‌ పండుగకు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ బాన్సువాడకు చెందిన కిరాణ వ్యాపారి మురళీధర్‌కు ఆరువేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్‌ చేశాడు. వాటి విలువ 36లక్షల రూపాయలు. అయితే ఎమ్మెల్యే 12లక్షల రూపాయలను మాత్రమే తనకు చెల్లించినట్లు బాధిత వ్యాపారి చెబుతున్నాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులను అడిగిన పాపానికి.. ఎమ్మెల్యే తనను తిడుతున్నాడని వ్యాపారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చేది లేదని తనను బెదిరిస్తున్నట్లు వాపోతున్నాడు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story