మంచిర్యాల జిల్లాలో విషాదం.. గొల్లవాగులో మునిగిన నాటుపడవ

X
Highlights
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భీమారం మండలంలో గొల్ల వాగు ప్రాజెక్టు లో నాటు పడవ మునిగి ఇద్దరు...
Arun Chilukuri26 Oct 2020 5:48 AM GMT
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భీమారం మండలంలో గొల్ల వాగు ప్రాజెక్టు లో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు ఎక్కాల్సిన పడవలో ఐదుగురు వ్యక్తులు ఎక్కడంతో పడవ మునిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారని బొంతల రమేష్,. రాజబాపులుగా గుర్తించారు. మంచిర్యాల జిల్లా ఆర్డీఓ , జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. సింగరేణి రెస్క్యూ టీం, గజ ఇతగాళ్లు గల్లంతైన వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఘటనపై ఎమ్మెల్యే బాల్క సుమన్ విచారం వ్యక్తం చేశారు.
Web TitleBoat Capsizes In Golla Vagu Mancherial District
Next Story