BL Santosh: ఇవాళ తెలంగాణకు బీఎల్‌ సంతోష్‌

BL Santosh Is Coming To Telangana Today
x

BL Santosh: ఇవాళ తెలంగాణకు బీఎల్‌ సంతోష్‌

Highlights

BL Santosh: నేటి నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా బీజేపీ పార్లమెంట్‌ విస్తారక్‌ల సమావేశాలు

BL Santosh: ఇవాళ తెలంగాణకు బీఎల్‌ సంతోష్‌ రానున్నారు. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా బీజేపీ పార్లమెంట్‌ విస్తారక్‌ల సమావేశాలు జరగనున్నాయి. వర్చువల్‌గా విస్తారక్‌ల సమావేశాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలకు 92 పార్లమెంట్‌ నియోజకవర్గాల విస్తారక్‌లు హాజరుకానున్నారు. ఇక.. రెండురోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు బీజేపీ పార్లమెంట్‌ సమావేశాల్లో బీఎల్‌ సంతోష్‌ పాల్గొంటారు. బీజేపీ ముఖ్యనేతలు, చేరికల కమిటీతో బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సల్ భేటీ కానున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్‌లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇక తెలంగాణ నుంచి ఈ విస్తారక్‌ల సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories