జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఉద్రిక్తత

X
Highlights
జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గొల్లపల్లి...
Arun Chilukuri30 Dec 2020 3:01 PM GMT
జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే బీజేపీ కార్యకర్తలు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. స్టేషన్ గేట్లను బద్ధలు కొట్టి బయటకు వచ్చేందకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించి వారిని చెదరగొట్టారు. ఎస్సై అత్యుత్సాహంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. ఉదయం మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది.
Web TitleBJP Workers and Police Fight Each other in Gollapally
Next Story