Amit Shah: తెలంగాణలో 10 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తాం

Amit Shah: తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ దగ్గర పడుతుండటంతో జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు.

Arun Chilukuri
Updated on: 9 May 2024 5:00 PM IST
BJP Will Win More Than 10 Seats In Telangana Says Amit Shah
X

Amit Shah: తెలంగాణలో 10 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తాం

Amit Shah: తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ దగ్గర పడుతుండటంతో జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అమిత్ షా రాష్ట్రానికి రాగా... ఇవాళ భువనగిరిలో ప్రచారం నిర్వహించారు. అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని షా విమర్శించారు. తెలంగాణలో పది కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటుందని విమర్శించారు. ఏ అసదుద్దీన్..బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్..ఈ మూడు ఒక్కటేనని చెప్పారు. ఎంఐఎంను ఆపేది బీజేపీ ఒక్కటేనన్నారు అమిత్ షా.. ఈ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినాన్ని జరపనివ్వరు.. సీఏఏ ను అమలు చెయ్యనియ్యరని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story