బీజేపీ విజయ సంకల్ప సభకు కదిలిన కాషాయదండు

జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్న బీజేపీ శ్రేణులు

Rama Rao
Published on: 3 July 2022 1:41 PM IST
BJP Vijaya Sankalpa Sabha in Hyderabad | TS News
X

బీజేపీ విజయ సంకల్ప సభకు కదిలిన కాషాయదండు

BJP Vijaya Sankalpa Sabha: సికింద్రాబాద్‌లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. ట్రైన్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో హైదరాబాద్‌ తరలి వస్తున్నారు. బీజీపే విజయ సంకల్ప సభకు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీజేపీ కండువాలు, జెండాలతో ప్రైవేటు వాహనాల్లో హైదరాబాద్ తరలి వెళ్లారు.

ఇటు ఖమ్మం నుంచి భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఖమ్మం నుంచి ప్రత్యేక ట్రైన్‌లో కార్యకర్తలు బయలుదేరారు. బీజేపీ శ్రేణులతో ఖమ్మం రైల్వే స్టేషన్ సందడిగా మారింది. కొత్తగూడెం నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయ సంకల్ప సభకు తరలి వస్తున్నారు. ప్రత్యేక ట్రైన్‌లో కార్యకర్తలు ,అభిమానులు తరలి వస్తున్నారు.బీజేపీ బహిరంగ సభకు వికారాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక ట్రైన్‌లో తరలి వెళ్లారు. సభకు తరలి వచ్చే వారి కోసం భోజనం ప్యాకెట్లను అందించారు.

Rama Rao

Rama Rao

Next Story