ఇవాళ వరంగల్‌లో బీజేపీ నిరుద్యోగ మార్చ్

BJP: సా.4 గంటలకు కేయూ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు మార్చ్‌

Jyothi
Published on: 15 April 2023 9:00 AM IST
BJP Unemployment March in Warangal Today
X

ఇవాళ వరంగల్‌లో బీజేపీ నిరుద్యోగ మార్చ్

BJP: TSPSC పేపర్‌ లీకేజీతోపాటు నిరుద్యోగుల బాధలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో బీజేపీ ఓరుగల్లు వేదికగా తలపెట్టిన నిరుద్యోగ మార్చ్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ నిరుద్యోగ మార్చ్‌కు షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు.

ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను విమర్శిస్తూ ప్రసంగాలు చేయరాదని హెచ్చరించారు. రోడ్డుకు ఎడమవైపే మార్చ్‌ సాగాలని, డీజే స్పీకర్లు వాడరాదని సూచించారు. అలాగే.. మార్చ్‌ సాగే మార్గంలో మధ్య మధ్య ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల కార్యకలాపాలకు ఆటంకం కలిగించరాదని షరతులు విధించారు.

Jyothi

Jyothi

Next Story