TS BJP: నేడు తెలంగాణలో బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ సమావేశాలు..

TS BJP: వంద రోజుల కార్యాచరణ ఎన్నికల సంసిద్ధతపై చర్చ

Shekhar G
Published on: 16 July 2023 10:05 AM IST
BJP Tiffin Box Meetings In Telangana Today
X

TS BJP: నేడు తెలంగాణలో బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ సమావేశాలు.. 

TS BJP: వంద రోజుల కార్యాచరణ, పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టిఫిన్‌ బాక్స్‌ సమావేశాల్ని నిర్వహించనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిర్వహించే ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. కార్యకర్తలు ఇంటినుంచే టిఫిన్‌ బాక్స్‌ తెచ్చుకుని అందరితో కలిసి తినడం, పార్టీ కార్యక్రమాల్ని తెలుసుకోవడం, చర్చించడం, వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌ ఆర్మూర్‌, సోయం బాపురావు బోథ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌, ఎమ్మెల్సీ ఎ.వెంకటనారాయణరెడ్డి జనగామ, జాతీయ కార్యవర్గసభ్యులు జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్‌, వివేక్‌ వెంకటస్వామి పెద్దపల్లి, నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్‌పేట, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో..ఇతర నేతలు మిగతా నియోజకవర్గాల్లోని సమావేశాల్లో పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story