వామన్‌రావు హత్యకు నిరసనగా జనగామలో బీజేపీ ఆందోళన

* టీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ నేతలు

Sandeep Eggoju
Updated on: 18 Feb 2021 8:31 PM IST
BJP Strike Against to Vaman Rao death issue
X

బీజేపీ (ఫైల్ ఇమేజ్)

హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతులను పట్టపగలే హత్య చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లాలో బిజెపి, బిజెవైఎం నేతలు ఆందోళన బాటచేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. జనగామ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి బీజేపీ, బిజెవైఎం నేతలతో కలసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హైకోర్టు న్యాయవాదుల వామాన్ రావు దంపతుల హత్య చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఉరిశిక్ష విధించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story