Sagar Bypoll: సాగర్ అభ్యర్ధిపై అయోమయంలో బీజేపీ

Sagar Bypoll: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని టీఆర్ఎస్‌ ప్రకటించింది. దీంతో బీజేపీ అయోమయంలో పడింది.

Arun Chilukuri
Published on: 29 March 2021 7:46 PM IST
BJP Still not Finalized Candidate for Nagarjuna Sagar BY Election
X

Sagar Bypoll: సాగర్ అభ్యర్ధిపై అయోమయంలో బీజేపీ

Sagar Bypoll: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని టీఆర్ఎస్‌ ప్రకటించింది. దీంతో బీజేపీ అయోమయంలో పడింది. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కమలం నేతలు. టికెట్ దక్కని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకొని సాగర్ బరిలో దిగాలని బీజేపీ భావించింది. అయితే టీఆర్ఎస్‌ తమ పార్టీ అసంతృప్తులను కట్టడి చేసింది. తాజాగా అసంతృప్తులపై ఆశలు కాషాయ పార్టీ వదులుకుంది. సొంత పార్టీ నుంచే అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో కుల సమీకరణాలను పరిశీలిస్తోంది బీజేపీ. ఆశావహుల జాబితాను హైకమాండ్‌కు పంపించామని చెబుతున్నారు కమలనాథులు. టికెట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంటున్న బీజేపీ ఆశావహులు. బీజేపీ టికెట్ రేసులో రవినాయక్, అంజయ్యయాదవ్, నివేదితారెడ్డి, ఇంద్రసేనారెడ్డిలు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story