Bandi Sanjay: బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

* బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం * అవసరమైతే తెలంగాణలో మత విద్వేశాలు రగిలిస్తాం

Arun Chilukuri
Updated on: 30 Aug 2021 7:10 PM IST
BJP State President Bandi Sanjay Once Again Made Sensational Remarks
X

బండి సంజయ్ (ధీ హన్స్ ఇండియా )

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకొని హిందువులకు అప్పగిస్తామన్నారు. అవసరమైతే తెలంగాణలో మత విద్వేషాలు రగిలిస్తామన్నారు. హిందువుల భూములను ఆక్రమించుకొని కొందరు నిజాం ఆస్తులుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుందని విమర్శించారు.

ఒక కుటుంబం చేతిలో బంధి అయినట్లు తెలంగాణ తల్లి ఘోషిస్తుందున్నారు భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు మీదనే భాగ్యనగరంగా వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలి? కేసీఆర్ సీఎం అయ్యాక నిజాం సమాధి వద్ద మోకరిల్లాడు ఒక్క కుటుంబం చేతిలో బంధీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోంది కోటపేటలో దళితుల భూములును వేయటాన్ని బీజేపీ ఖండిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story