సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay: రేపు ఈటల బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు * జాతీయ నేతలతో సమావేశం కానున్న బండి సంజయ్

Sandeep Eggoju
Published on: 13 Jun 2021 1:47 PM IST
BJP State President Bandi Sanjay Going to Delhi Today Evening
X

బండి సంజయ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Bandi Sanjay: ఇవాళ సాయంత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఈటల రాజేందర్ కాషాయ కండువ కప్పుకోనున్న నేపథ్యంలో.. ముందుగానే జాతీయ నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల జాయిన్ కానున్నారు. రేపు లక్ష్మణ్, డీకే అరుణ, మరళీధర్ రావులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే.. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఈటల రాజేందర్ తన అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story