Bandi Sanjay: సర్జికల్ స్ట్రయిక్ పై కేసీఆర్ కు భారీ రెస్పాన్స్ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: ఈ దేశంలో ఉండే అర్హత కేసీఆర్ కు లేదు

Rama Rao
Updated on: 14 Feb 2022 5:45 PM IST
BJP State President Bandi Sanjay Countered CM KCR | Telangana News Today
X

 సర్జికల్ స్ట్రయిక్ పై కేసీఆర్ కు భారీ రెస్పాన్స్ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: సర్జికల్ స్ట్రయిక్ మీద నాక్కూడా అనుమానాలున్నాయన్న కేసీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సర్జికల్ స్ట్రయిక్ తరువాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడిన వీడియోను, ఆ తరువాత పాక్ సైన్యాధికారి రెస్పాన్స్ ను విలేకరులకు చూపించారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందని మన ప్రధాని కన్ఫామ్ చేశారు.. ఆ రోజున తమ దేశంలో ఏం జరిగిందో పాకిస్తాన్ చెప్పింది. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం అనుమానిస్తున్నాడంటూ సంజయ్ చాలా తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ దేశ ద్రోహి అని, అతను ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదన్నారు.

సర్జికల్ స్ట్రయిక్ జరిగిన రోజు దేశమంతా పండుగ చేసుకున్నారని, వీధుల్లోకి వచ్చి నివాళులు అర్పించారని, మీడియా కూడా భారీ ఎత్తున రెస్పాండ్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్ మాత్రం స్ట్రయిక్ ను అనుమానిస్తున్నారని, కేసీఆర్ రక్తంలో పాకిస్తాన్ రక్తం కలిసి ఉందేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story