Telangana BJP: లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. రేపు, ఎల్లుండి బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు

Telangana BJP: వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం

Shekhar G
Updated on: 6 Jan 2024 8:46 PM IST
BJP state level meetings
X

Telangana BJP: లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. రేపు, ఎల్లుండి బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు

Telangana BJP: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రేపు, ఎల్లుండి రాష్ట్ర స్థాయి సమావేశాలు జరగనున్నాయి. సమావేశానికి సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌, కిషన్‌రెడ్డి , ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను వేయనుంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్‌ ఫోకస్‌ చేసింది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సంస్థాగతంగా మార్పులు చేర్పుల పైన నేతలు చర్చించనున్నారు. కొంత మంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story