Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Mahbubnagar: పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌

Dhatripriya
Published on: 24 Jan 2023 11:25 AM IST
BJP state executive meeting in Mahbubnagar
X

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Mahbubnagar: నేడు మహబూబ్‌నగర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌, ఇతర నేతలు హాజరుకానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీ నేతలు, దక్షిణ తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై పాలమూరు వేదికగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి, పార్టీ కార్యాచరణపై చర్చ జరగనుంది. పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడం ఎలా..? ఎన్నికలను ఎలా ఎదర్కోవాలి..? ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ లో చేయాల్సిన పోరాటాలు తదితర అంశాలపై చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story