Bandi Sanjay: బీఆర్ఎస్ రైతు ధర్నాలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: రుణమాఫీ, ఉచిత యూరియా సహా రైతులకు ఇచ్చిన.. హామీలు ఎందుకు అమలు చేయడం లేదు?

R Tripura Malini
Published on: 23 Dec 2022 6:33 PM IST
BJP State Chief Bandi Sanjay Fire On BRS Rythu Dharnas
X

బీఆర్ఎస్ రైతు ధర్నాలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: బీఆర్ఎస్ రైతు ధర్నాలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైరయ్యారు. రైతులపై ఎందుకీ మొసలి కన్నీరని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ధర్నాలు చేసిందని మండిపడ్డారు. నరేగా చట్టంపై కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్న సంజయ్ వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం సాధ్యం కాదని తెలియదా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ దొంగలు ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని లెక్కలడిగితే సెంటిమెంట్‎తో రెచ్చగొట్టాలనుకుంటున్నారని ఫైరయ్యారు. రుణమాఫీ, ఉచిత యూరియా సహా రైతులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story