TS BJP: సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల నియోజకవర్గాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్

TS BJP: నాలుగు నియోజకవర్గాల్లో వరుస ప్రచారాలు చేయనున్న జేపీ నడ్డా, అమిత్ షా

Shekhar G
Published on: 20 Oct 2023 7:36 PM IST
BJP Special Focus On Constituencies Of CM KCR Family Members
X

TS BJP: సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల నియోజకవర్గాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్

TS BJP: బీజేపీ కేంద్ర నాయకత్వం సీఎం కేసీఆర్ కుటుంబంపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబసభ్యుల నియోజకవర్గాల్లో చెక్ పెట్టేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి.. హరీష్ రావు పోటీ చేసే సిద్దిపేట, కేటీఆర్ పోటీ చేసే సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తోందట బీజేపీ నాయకత్వం. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ చీఫ్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస ప్రచారాలు చేసి.. కేసీఆర్ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story