BJP: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై బీజేపీ సమరభేరీ

BJP: "ప్రజా బ్యాలెట్‌" పేరుతో బీజేపీ ప్రజాభిప్రాయ సేకరణ

Shireesha
Published on: 28 March 2022 8:02 AM IST
BJP Samarabheri Against Electricity Charges Hike in Telangana | Live News
X

BJP: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై బీజేపీ సమరభేరీ

BJP: తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై బీజేపీ సమర భేరీ మోగించింది. 'ప్రజా బ్యాలెట్' పేరిట ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇవాళ బషీర్‌బాగ్‌లో 'ప్రజా బ్యాలెట్' ప్రారంభించనున్నారు బీజేపీ నేతలు. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు. ధర్నాలు, ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేంతవరకు ఆందోళనలు చేపడతామన్నారు. 22 ఏళ్ల క్రితం కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాల పిలుపునివ్వడంతో బషీర్‎బాగ్ ప్రాంతానికి వేలాది మంది తరలివచ్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించారు. నాటి ఘటనకు సాక్షిగా మారిన బషీర్ బాగ్ ప్రాంతంలోనే కరెంట్ ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రజా బ్యాలెట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని బీజేపీ నిర్ణయించింది.

Shireesha

Shireesha

Next Story