Nalgonda: కాసేపట్లో అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రానికి బండి సంజయ్

*బండి సంజయ్ డౌన్‌డౌన్ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు *కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

Shilpa
Updated on: 15 Nov 2021 1:09 PM IST
BJP President Bandi Sanjay will Visit Arjalabhavi IKP Centre in Nalgonda Today 15 11 2021
X

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

Nalgonda: నల్గొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్గొండ సమీపంలోని అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో వెళ్లనున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు. అటు బీజేపీ శ్రేణులు కూడా అర్జాలబావి వద్దకు భారీగా తరలివచ్చారు.

దీంతో ఇరు వర్గాలు నినాదాలతో హోరెత్తించాయి. మోడీ, బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో అప్రమ్తతమైన పోలీసులు భారీగా మోహరించారు.

Shilpa

Shilpa

Next Story