Praja Sangrama Yatra: 14న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు

Praja Sangrama Yatra: *హాజరుకానున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా *5 లక్షల మందిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక

Rama Rao
Updated on: 9 May 2022 11:32 AM IST
BJP Plans 5 Lakh Crowd at Amith Shah’s May 14 Rally
X

Praja Sangrama Yatra: 14న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు

Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో సభ జరగనుంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరవుతున్నారు. 5 లక్షల మందితో సభ నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమైంది.

కాంగ్రెస్‌ వరంగల్‌లో నిర్వహించిన రాహుల్‌ గాంధీ సభ కన్నా నాలుగైదు రెట్లు అధికంగా ప్రజలను సమీకరించి, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది. అందులో భాగంగా సంజయ్‌ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కరెంట్‌ చార్జీల పెంపును నిరసిస్తూ మండలాలు, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, కరెంట్‌ బిల్లులను దహనం చేయాలని పిలుపునిచ్చారు. నాగరాజు హత్యపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసనలు తెలపాలని సూచించారు.


Rama Rao

Rama Rao

Next Story