అయితే మాకు, లేదంటే ఆయనకు.. టీ బీజేపీలో కొత్త లెక్క కథేంటి?

అయితే మాకు, లేదంటే ఆయనకు.. టీ బీజేపీలో కొత్త లెక్క కథేంటి?
x
అయితే మాకు, లేదంటే ఆయనకు.. టీ బీజేపీలో కొత్త లెక్క కథేంటి?
Highlights

బీజేపీ రాష్ట్ర అధ‌్యక్షునిగా, ఆయనను చాలామంది సీనియర్లు వద్దువద్దు అన్నారు. కానీ ఇప్పుడు ఆయనే ముద్దుముద్దు అంటున్నారట. కొత్తవారిని ఎంతమాత్రం సహించని...

బీజేపీ రాష్ట్ర అధ‌్యక్షునిగా, ఆయనను చాలామంది సీనియర్లు వద్దువద్దు అన్నారు. కానీ ఇప్పుడు ఆయనే ముద్దుముద్దు అంటున్నారట. కొత్తవారిని ఎంతమాత్రం సహించని సీనియర్లు, వద్దువద్దు అన్న నాయకుడిని, ఇప్పుడెందుకు ఓకే అంటున్నారు. దీని వెనక వారికంటూ ఒక ఇంట్రెస్టింగ్‌ రీజన్ వుంద అదేంటి?

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎంపిక చివరి అంకానికి చేరుకోవడంతో అనేక కొత్త వ్యూహాలు బయటపడుతున్నాయట. పార్టీలో కొత్త అధ్యక్షుని ఎంపిక తప్పసరి కావడంతో, సీనియర్లంతా ఏకమై తమ పెత్తనం వ్యూహాన్ని అమలు చేయడానికి పావులు కదుపుతున్నారట. ఇటీవల అధ్యక్ష ఎంపిక కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో మళ్లీ లక్ష్మణ్‌నే కొనసాగించాలని కొందరు ప్రతిపాదన తెచ్చినా, అధ్యక్షుడు మారాల్సిందే అనే ఆదేశాలు రావడంతో, ఉన్నవారిలో బెటర్ నేతను సీనియర్లు ఎంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల భైంసా ఘటనలో కీలకంగా వ్యవహరించి, వివాదాస్పద వాఖ్యలు చేసే నేతను అధ్యక్షుడిగా ఎంపిక చేయించుకుంటే తమ పెత్తనం కొనసాగుతుందని సీనియర్లు భావిస్తున్నారట.

ఆయన ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మాటల తూటాలు పేల్చే నేత. ఈమధ్య వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో, ఆయన పేరు మార్మోగుతోంది. అధ్యక్ష రేసులో వినిపించిన ఐదు పేర్లలో ఈయన పేరొకటి. కానీ సీనియర్లు మొదట ఈ నాయకుడిని వద్దన్నారు. ఇప్పడు ఈయనైతే కాస్త బెటరని ఫీలవుతున్నారట. ఇందుకు వారికంటూ ప్రత్యేక కారణాలున్నాయన్నది పార్టీలో వినిపిస్తున్న చర్చ.

ఆ లీడర్‌కు ఆ జిల్లాలో ఫాలోవర్స్ ఉన్నా, రాష్ట్రమంతా పెద్దగా ప్రభావం చూపలేరన్నది సీనియర్ల భావన. అందుకే సదరు నేత వైపు పార్టీ సీనియర్లు మొగ్గు చూపుతున్నారట. ఆయన కాకుండా డికే అరుణ, ఎంపి అర్వింద్, అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు లాంటి నేతలను అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే, తమ పెత్తనం సాగదన్న అభద్రతాభావలో వున్నారట సీనియర్లు. అందుకే ఈ నేతను దాదాపు ఫైనల్ చేయడానికి సుముఖంగా ఉన్నారట. సీనియర్లు అంగీకరిస్తున్న ఆ నేత హైదరాబాద్‌లో పెద్దగా ప్రభావం చూపలేరని, దక్షిణ తెలంగాణ, ప్రధానంగా హైదరాబాద్ లాంటి ముఖ్యమైన ప్రాంతంలో, ఆయనకు ఫాలోవర్స్ లేరు కాబట్టి, సీనియర్లంతా పార్టీపై తమ పెత్తనం కొనసాగించవచ్చని భావిస్తున్నారట.

ఇస్తేగిస్తే మాకు అవకాశమివ్వండి లేకుంటే కేవలం ఆ నేతకే ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారట. దీనికి తోడు వీళ్లు అంగీకరిస్తున్న నేతకు అంగ బలం లేదు, అర్ధబలం అంతకన్నా లేదు. దీంతో భవిష్యత్తులో తమకు ప్రమాదం కాడనే ముందుజాగ్రత్తతోనే ఆయన పేరును ఓకే చేస్తున్నారట సీనియర్లు. అలాంటి ముందుచూపుతోనే, రాష్ట్ర బీజేపీ పీఠంపై ఆ లీడర్‌ను కూర్చోబెట్టాలని సిఫారసు చేస్తున్నారట. కానీ సీనియర్లు ఆయన్ను డమ్మి అధ్యక్షుడిగా భావిస్తున్నా ఆయన ఫాలోవర్స్ పెరిగి సక్సెస్ అయితే మాత్రం, ఏకు మేకై కూర్చుంటారే భయం కూడా వాళ్లను వెంటాడుతోందట. మరి ఏం చేస్తారో చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories