JP.Nadda: రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఉదయం 10 గంటలకు 11 రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం

JP.Nadda: హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు,జాతీయ కార్యవర్గ సభ్యులు

Shekhar G
Updated on: 9 July 2023 11:59 AM IST
BJP National President JP Nadda Will Visit Hyderabad Tomorrow
X

JP.Nadda: రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఉదయం 10 గంటలకు 11 రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం

JP.Nadda: రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు 11 రాష్ట్రాల అధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశమవుతారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం హాజరుకానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌తో పాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శలతో జేపీ నడ్డా సమీక్ష నిర్వహించనున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడంపై నడ్డా సూచనలు చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఇప్పటికే అధినాయక్వం కేడర్‌కు సూచనలు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులంతా ప్రజల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాల అధ్యక్షులకు నడ్డా సూచించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story