Hyderabad:హెచ్‌ఐసీసీలో బీజేపీ పదాధికారుల సమావేశం

BJP National Executive Meeting To Begins
x

Hyderabad:హెచ్‌ఐసీసీలో బీజేపీ పదాధికారుల సమావేశం

Highlights

Hyderabad: కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Hyderabad: భాగ్యనగరంలో బీజేపీ నేతల సందడి నెలకొంది. HICCలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ చీఫ్ నడ్డా నేతృత్వంలో పదాధికారుల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి 148 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కార్యవర్గం సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ సంస్థాగత బలోపేతంపై వ్యూహాలను రచించనున్నారు.

మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో HICCకి బీజేపీ ముఖ్య నాయకులు క్యూ కడుతున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు.. బీజేపీ పాలిత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మొత్తం 352 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు. దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై చర్చించనున్నారు. బీజేపీ రాజకీయ తీర్మానాలపై కూడా చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories