ఆ యువ ఎంపీపై సిటీలో కేసు

ఆ యువ ఎంపీపై సిటీలో కేసు
x
Highlights

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ఓయూ పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించారని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు ఓయూ రిజిస్ట్రార్‌....

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ఓయూ పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించారని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు ఓయూ రిజిస్ట్రార్‌. నిబంధనలకు విరుద్ధంగా సభ నిర్వహించారని పేర్కొన్నారు. దీంతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి తేజస్వి పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతిని తీసుకోలేదు. అలాగే- విశ్వవిద్యాలయం అధికార యంత్రాంగం నుంచీ అనుమతులు తీసుకునే ప్రయత్నం చేయలేదు. దీనితో ఆయనపై ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. అక్రమంగా క్యాంపస్‌లోకి ప్రవేశించారని లిఖితపూరక ఫిర్యాదు ఇచ్చారు. దీనితో పోలీసులు తేజస్విపై క్రిమినల్ ట్రెస్ పాసింగ్ కింద కేసు నమోదు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories