BJP MP Laxman: ఢిల్లీ మంత్రి అయినా..సీఎం కూతురైనా వదిలేది లేదు..

BJP MP Laxman: తప్పు చేసిన వారు ఢిల్లీ మంత్రి అయినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురైనా ఎవరైనా చట్టం ముందు సమానులే అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.

Arun Chilukuri
Published on: 3 Dec 2022 7:01 PM IST
BJP MP Laxman Slams CM KCR
X

BJP MP Laxman: ఢిల్లీ మంత్రి అయినా..సీఎం కూతురైనా వదిలేది లేదు..

BJP MP Laxman: తప్పు చేసిన వారు ఢిల్లీ మంత్రి అయినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురైనా ఎవరైనా చట్టం ముందు సమానులే అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. పార్టీలో చేరిన తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మర్రి శిశధర్ రెడ్డిని లక్ష్మణ్ సాదరంగా స్వాగతించారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతో మర్రిశశిదర్ రెడ్డి బీజేపీలో చేరడం శుభపరిణామం అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న లక్ష్మణ్.. ఈడీ సీబీఐవంటి సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయన్నారు. తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముందని చురకలంటించారు. తెలంగాణలో అవినీతి పాలనను అంతం చేసి బీజేపీ జెండా ఎగురవేస్తామని అందుకు ప్రజలు, మేధావుల సహాయసహకారాలు అవసరం అన్నారు. పార్టీ ఫిరాయింపులు బీజేపీకి అలవాటు లేదని ఆసంస్కృతి టీఆర్ఎస్ దేనని గుర్తు చేశారు లక్ష్మణ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story