MP Laxman: మునుగోడులో ఓట్ల కోసమే టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం

*చేనేత రంగంపై 5శాతం జీఎస్టీపై స్పందించిన ఎంపీ లక్ష్మణ్

Rama Rao
Published on: 29 Oct 2022 5:17 PM IST
BJP MP Laxman Comments On TRS Government | TS News
X

MP Laxman: మునుగోడులో ఓట్ల కోసమే టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం

MP Laxman: మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ చేనేతలపై జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. చేనేత రంగంపై 5శాతం జీఎస్టీ పేరుతో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుచేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదన్న ఆయన.. ఆనాడు జీఎస్టీ నిర్ణయాన్ని ఒప్పుకుని సంతకాలు చేసి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మునుగోడులో ఓట్లకోసం బీజేపీని ,కేంద్రాన్ని బద్నాం చేయడం బాధాకరమన్నారు. చిత్తశుద్ధి ఉంటే చేనేత రంగంపై రాష్ట్ర వాటాను వదులుకోవాలని సవాలు విసిరారు.

Rama Rao

Rama Rao

Next Story