అధికార పార్టీ మంత్రిపై బీజేపీకి ఎందుకంత సింపతీ?

అధికార పార్టీ మంత్రిపై బీజేపీకి ఎందుకంత సింపతీ?
x
Highlights

ఛాన్స్‌ దొరికితే చాలు, కొందరికి సానుభూతి మాటలు వెల్లువలా వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ నాయకుడైనా, సింపతీ చూపేందుకు ఏమాత్రం వెనకాడ్డంలేదు. మీరు పార్టీ...

ఛాన్స్‌ దొరికితే చాలు, కొందరికి సానుభూతి మాటలు వెల్లువలా వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ నాయకుడైనా, సింపతీ చూపేందుకు ఏమాత్రం వెనకాడ్డంలేదు. మీరు పార్టీ నుంచి బయటకు రండి, పోరాడదాం అంటూ, ఏకంగా అధికార పార్టీ మంత్రినే టెమ్ట్‌ చేసేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన నేతలు, అదే పని చేస్తున్నారు. ఇంతకీ ఎవరిపై సానుభూతి వల విసురుతున్నారు...?

మంత్రి ఈటెల రాజేందర్ మొన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా దుమారం లేపాయి. అయితే ఆ తరువాత ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈటెల చెప్పినా కూడా, ముందు చేసిన వ్యాఖ్యల హడావుడి మాత్రం తగ్గలేదు. మరోవైపు ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈటెలపై సానుభూతి చూపి, తమవైపు ఆకర్షించేందుకు అన్ని పార్టీలు, గాలమేసే ప్రయత్నం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఆ వరుసలో ముందున్నట్టు కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ.

ఈటెల రాజేందర్‌ కామెంట్లపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు, అలాంటి చర్చకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన ముంపు గ్రామస్తులు చేసిన ఆందోళన కార్యక్రమంలో, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం అటెండయ్యారు. బండి సంజయ్ తన స్పీచ్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌ను సపోర్ట్ చేస్తూ, ఆయన టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి మిడ్ మానేరు గ్రామస్తుల గురించి పోరాడితే, ఆయన నాయకత్వంలో నడిచేందుకు సిద్ధమేనని అన్నారు. అంతేకాదు తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభించాలని, ఈటెలే అందుకు నేతృత్వం వహించాలని సంజయ్‌ కామెంట్లు చేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలే, ఇప్పుడు టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ శ్రేణుల్లోనూ, కొత్త చర్చకు దారి తీశాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్, జెండా ఓనర్ షిప్ కోసం అవమాన పడుతున్నారని, తెలంగాణలో మలిదశ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాలి అంటూ చాలా చోట్ల బండి సంజయ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బహిరంగంగా చెబుతుండటంతో, పరోక్షంగా ఈటల రాజేందర్‌ను బిజెపిలోకి ఆహ్వానించడమే కాకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు దగ్గరగా వెళ్లేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందన్న చర్చ పెద్దఎత్తున సాగుతోంది.

మొత్తానికి ఈటెల చేసిన కామెంట్లపై, ఇతర పార్టీల నేతలు తమదైన శైలిలో తమకు అనుకూలంగా మలచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. కాంగ్రెస్‌ నేతలు వీహెచ్, రేవంత్‌ రెడ్డి కూడా, మొన్న ఈటెలకు సంఘీభావంగా లేదంటే మరింత రెచ్చగొట్టేలా కామెంట్లు చేశారు. ఇప్పుడు బండి సంజయ్ కూడా, ఈటెలను తమవైపు ఆకర్షిచేందుకు మరింత సున్నితంగా ట్రై చేస్తున్నారని, వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని, పార్టీల కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకెంత రసవత్తరంగా మారతాయో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories