Bandi Sanjay: బండి సంజయ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ

Bandi Sanjay: సంజయ్‌‌పై, తన కార్యాలయంపైన దాడి చేసిన ఆధారాలను.. వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ.

Sriveni Erugu
Updated on: 22 Jan 2022 5:16 PM IST
The Parliamentary Privilege Committee took the attack on Bandi Sanjay seriously
X

బండి సంజయ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఫిబ్రవరి 3న కమిటీ ముందు హాజరు కావాలని అధికారులకు కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యానారయణ సహా బధ్యులైన పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక శుక్రవారం బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. తనపై, తన కార్యాలయంపైన దాడి చేసిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను ప్రివిలేజ్ కమిటీకి సమర్పించారు. బండి సంజయ్ వాదానలు విన్న కొన్ని గంటల్లోనే లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story