క్షీణిస్తున్న బండి సంజయ్‌ ఆరోగ్యం

క్షీణిస్తున్న బండి సంజయ్‌ ఆరోగ్యం
x
Highlights

ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా బండి సంజయ్‌ని హత్య చేయాలని చూస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని రాకేష్ వెల్లడించారు.

ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా బండి సంజయ్‌ని హత్య చేయాలని చూస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని రాకేష్ వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నందున షుగర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రభుత్వ వైద్యుడు ఎంపీ బండి సంజయ్ ఆరోగ్యంపై ఆరా తీయకపోవడం శోచనీయమన్నారు.

అటు కరీంనగర్ లో దీక్ష చేస్తున్న బండి సంజయ్ కి సంఘీభావం తెలిపారు బీజేపీ నేత డీకే అరుణ. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ లేని సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో అప్రజాస్వామికంగా సోదాలు చేస్తున్నారన్నారు. దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు డీకే అరుణ.

Show Full Article
Print Article
Next Story
More Stories