ప్రశాంత్‌రెడ్డి వర్సెస్‌ అర్వింద్‌.. చిలికి చిలికి గాలివానలా మారిందా?

BJP MP Aravind Vs TRS Minister Prashanth Reddy in Nizamabad
x

ప్రశాంత్‌రెడ్డి వర్సెస్‌ అర్వింద్‌.. చిలికి చిలికి గాలివానలా మారిందా?

Highlights

Nizamabad: ఆయన రాష్ట్ర మంత్రి. పైగా అధికార పార్టీలో ముఖ్యనేత.

Nizamabad: ఆయన రాష్ట్ర మంత్రి. పైగా అధికార పార్టీలో ముఖ్యనేత. ఇంకో నాయకుడు లోకల్‌ ఎంపీ. ప్రతిపక్ష పార్టీలో కీలక నేత. ఇద్దరిదీ ఒకే మండలం. కొద్ది రోజులుగా ఆ ఇద్దరు నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సై అంటే సై అంటున్నారు. ఆ ఎంపీ మంత్రిని టార్గెట్ చేస్తే తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారో చూస్తానంటూ మంత్రి సైతం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా కొద్ది రోజులుగా ఆ ఇద్దరి నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరి ఆ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇంతకీ ఆ ఎంపీ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు? మంత్రి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం వెనుక అసలు కారణాలేంటి? సై అంటే సై అంటున్న ఆ నేతలపై ఇందూరు పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చేంటి?

నిజామాబాద్ జిల్లాలో మంత్రి, ఎంపీ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయట. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి- ఎంపీ ధర్మపురి అర్వింద్‌ల మధ్య కొద్ది రోజులుగా పొలిటికల్ వార్ నడుస్తుంది. అదిప్పుడు చిలికి చిలికి గాలివానలా మారి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కార్నర్ చేస్తూ ఎంపీ అర్వింద్ పదేపదే విమర్శలు చేస్తుండటం, మంత్రికి మింగుడు పడటం లేదట. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఘటన జరిగినా ఎంపీ అర్వింద్‌ వెంటనే అక్కడ వాలిపోతుండటం. మంత్రిని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుండటంతో ఆయన నియోజకవర్గంలో ఎంపీ అడుగు పెట్టొద్దంటూ అధికార పార్టీ నేతలు భారీ స్కెచ్ వేసిందట. ఎంపీ తన నియోజకవర్గంలో పర్యటించకుండా పార్టీ శ్రేణులకు సదరు మంత్రి దిశానిర్దేశం చేశారన్న ప్రచారాల మధ్య ఇటు ఎంపీ సైతం అదే నియోజకవర్గంలో మరో భారీ కార్యక్రమానికి వ్యూహాం రచిస్తున్నారని సమాచారం.

ఇటీవల హసకొత్తూరులో సిద్దార్ద్ అనే యువకుడి అనుమానస్పద మృతిపై బీజేపీ పెద్ద ఉద్యమం చేసి సక్సెస్ అయ్యిందన్న టాక్‌ నడుస్తోంది. ఆ ఘటన మరువకముందే మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఏకంగా ధర్నా చేశారు ఎంపీ అర్వింద్. అంతేకాదు ఎర్గట్ల మండలం తాడ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలపై మంత్రికి వాటా ఉందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు దీనికి సరైన కౌంటర్ ఇచ్చినా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ మొదట్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై విమర్శలు చేసేందుకు వెనుకాడారట. మాది తెనాలి మీది తెనాలి అంటూ సాగిన పాటలోని ఓ సందర్భంలా ఆయనను మాత్రం విమర్శించేది లేదని తెగేసి చెప్పారట ఎంపీ అర్వింద్. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజులుగా ఎంపీ అర్వింద్ - మంత్రి ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ కార్నర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరువురు నేతలు విమర్శలు- ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎంపీ అర్వింద్ తన నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకోవాలని అధికార పార్టీ శ్రేణులకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించిందట. దీనికి బదులుగా ఇటు మంత్రి కూడా ఉమ్మడి జిల్లాలో తిరగడానికి వీళ్లేదని కమలం శ్రేణులకు పార్టీ దిశా నిర్దేశం చేసిందన్న టాక్‌ వినిపిస్తోంది.

బాల్కోండ నియోకవర్గంలో గులాబీ పార్టీని బలహీనం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసి కాషాయం జెండా ఎగురవేసేలా ఎంపీ వ్యూహం రచిస్తున్నారట. ఇటు మంత్రి సైతం బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాం సిద్ధం చేస్తున్నారట. తన నియోకవర్గంలో అడుగుపెట్టకుండా చేయాలని మంత్రి స్కెచ్ వేస్తుంటే మంత్రిని మరింత డ్యామేజ్ చేయాలని ఎంపీ బాల్కొండపైనే ఫోకస్ పెట్టారట.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీ అర్వింద్ తండ్రి డీఎస్‌ను విమర్శించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. జిల్లాలో కీలక నేతగా ఉన్న మంత్రిని టార్గెట్ చేస్తే గులాబీ పార్టీని ఇరుకులో పెట్టొచ్చనే వ్యూహాం ఉందట. బాల్కొండలో కొంచెం వీక్‌గా ఉన్న పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రిని కార్నర్ చేయడం అనివార్యమైందన్న ప్రచారం జరుగుతుందట. బాల్కొండపై ఫోకస్ పెడితే రెండు నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందనే అర్వింద్‌ ఈ వ్యూహాం అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ వ్యూహాం పసిగట్టిన మంత్రి నష్ట నివారణ చర్యలు చేపట్టి సై అంటే సై అంటున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories