Top
logo

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల రగడ..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల రగడ..
X

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల రగడ..

Highlights

తెలంగాణలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల హీట్ ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ నేత...

తెలంగాణలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల హీట్ ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ నేత శ్రావణ్ ఇటివలే కేటీఆర్ కు సవాల్ విసరడం దానికి మంత్రి తలసాని వ్యాఖ్యలు ప్రతిగా శ్రవణ్ మళ్లీ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలు ఈ విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. దీంతో రాజకీయ ఆరోపణలు, విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగలేఖలు ఇలా ఉద్యోగాల విషయంపై చర్చ సాగుతూనే ఉంది.

తాజాగా మంత్రి కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ముందు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తన సవాల్ ని స్వీకరించి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కి వచ్చి ఉద్యోగాలు, ఇతర అంశాలను నిరూపిస్తూ తాను ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని బహిరంగ చర్చకు రాకుంటే తన పైన చేసిన అసత్యపు ఆరోపణలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రామచందర్‌రావు.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచందర్‌రావు మంత్రి కేటీఆర్ కు విసిరిన సవాల్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ లేఖ రాశారు. శాఖల వారీగా అధికారికంగా ఉద్యోగాల లెక్కలు ప్రకటించినప్పటికీ చర్చల పేరుతో యువతను పక్కదోవ పట్టిస్తున్నారని లేఖలో విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ఉద్యోగాల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Web TitleBJP MLC Ramchander Rao challenges KTR on jobs issue
Next Story