Venkat Ramana Reddy: ఉద్యోగులకు జీతాలు తప్ప ఏమీ ఇవ్వడం లేదు

Venkat Ramana Reddy: ఉద్యోగులకు జీతాలు తప్ప ఏమీ ఇవ్వడం లేదు
x
Highlights

Venkat Ramana Reddy: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Venkat Ramana Reddy: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం నడవాలన్నా, ఏ ప్రభుత్వం విజయవంతం కావాలన్నా ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.

1వ తేదీన జీతాలు ఇస్తే సరిపోతుందా?

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. "ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఉద్యోగులకు కేవలం జీతాలు ఇస్తే సరిపోదు, వారికి రావాల్సిన ఇతర బకాయిల సంగతేంటి?" అని ప్రశ్నించారు. కేవలం జీతాలు తప్ప ఉద్యోగులకు ప్రభుత్వం నుండి వేరే ప్రయోజనాలేవీ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన

గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు సుమారు 20,500 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, కానీ వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు (గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటివి) ఏవీ ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జీవితాంతం సేవ చేసిన వారికి చివరి దశలో రావాల్సిన డబ్బుల కోసం తిప్పలు పెట్టడం దారుణమని మండిపడ్డారు.

టీఏ, డీఏ, పీఆర్సీ ఊసే లేదు..

ఉద్యోగులకు రావాల్సిన టి.ఏ (Travel Allowance), డీఏ (Dearness Allowance) బిల్లుల ఊసే లేదని వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇక పీఆర్సీ (PRC) అమలుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories