బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలుశిక్ష విధించిన నాంపల్లి కోర్టు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలుశిక్ష విధించిన నాంపల్లి కోర్టు
x

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలుశిక్ష విధించిన నాంపల్లి కోర్టు

Highlights

*గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలుశిక్ష *బీఫ్ ఫెస్టివల్ వివాదంలో శిక్ష విధించిన నాంపల్లి కోర్టు *బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ *ఐదేళ్ల క్రితం రాజాసింగ్‌పై నమోదైన కేసు

బీఫ్ ఫెస్టివల్ వివాదంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలుశిక్ష పడింది. ఐదేళ్ల క్రితం జరిగిన బీఫ్ ఫెస్టివల్‌ వ్యవహారంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు ఏడాది జైలు శిక్ష వేసింది నాంపల్లి కోర్టు. అయితే తీర్పు వెలువడిని కాసేపటికే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరైంది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో రాజా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్‌ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories