Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్‌

Raja Singh: పోలీసుల తీరుపై మండిపడిన రాజాసింగ్‌

Shashank Gullapelli
Published on: 28 March 2024 3:44 PM IST
BJP MLA Rajasingh House Arrest
X

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్‌

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు. చెంగిచెర్ల దాడి బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు రాజాసింగ్ నిర్ణయించుకోగా.. పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డారు రాజాసింగ్‌. బాధితులను పరామర్శించేందుకు బీజేపీ నేతలు వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెడతారా అన్న రాజాసింగ్.. బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story