Telangana Budget 2021: స్పీకర్ ని కలిసి నిరసన వ్యక్తం చేస్తాం..

Telangana Budget 2021: ప్రశ్నించే గొంతును నొక్కెలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుపుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 15 March 2021 5:41 PM IST
BJP MLA Raghunandan Rao Slams TRS Govt
X

ఫైల్ ఇమేజ్ 

Telangana Budget 2021: ప్రశ్నించే గొంతును నొక్కెలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుపుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సభను ఎలా నడపాలనుకుంటుందో చెప్పకనే చెప్పిందని విమర్శించారు. బీఏసీకి బీజేపీ సభ్యులను పిలవకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అవకాశవాద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

బీఏసీకి బీజేపీని పిలవకపోవడంపై స్పీకర్‌, సభా వ్యవహారాల మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభా నియమ నిబంధనలను టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదన్నారు. రేపు ఉదయం స్పీకర్‌ను కలిసి తమ నిరసన తెలియజేస్తామని సభ్యులకు ఉన్న హక్కులను గౌరవించాలన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్‌ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story