Hyderabad: అమ్నీషియా పబ్‌ కేసు.. సంచలన ఫొటోలు, వీడియోలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

Hyderabad: అమ్నేషియా పబ్‌ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

Arun Chilukuri
Updated on: 4 Jun 2022 1:09 PM IST
BJP MLA Raghunandan Rao Press Meet on Amnesia Pub Minor Girl Incident
X

Hyderabad: అమ్నీషియా పబ్‌ కేసు.. సంచలన ఫొటోలు, వీడియోలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన రావు

Hyderabad: అమ్నేషియా పబ్‌ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియా‌ను బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు నిందితులు వైపా..?, బాధితుల వైపా..? అని ప్రశ్నించారు. పోలీసులకు ధైర్యం ఉంటే.. తప్పుచేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. బాలిక రేప్‌ కేసులో కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయటపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఆ రోజు రెడ్‌ కలర్‌ బెంజ్‌ కారులో జరిగిన దృశ్యాలను మీడియాకు చూపించారు.

ఆ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని, అయినా పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. విచారణ పూర్తి కాకముందే కొందరికి క్లీన్ చీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్‌గాఉంచారని ప్రశ్నించారు. నిర్బయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్నవారి పిల్లనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story