కమిషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పై కేసీఆర్ పట్టు.. చేసేవి దొంగ ధర్నాలేనన్న ఈటల

Etela Rajender: టీఆర్ఎస్ మహాధర్నాపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 18 Nov 2021 4:53 PM IST
BJP MLA Etela Rajender Slams KCR over TRS Maha Dharna
X

కమిషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పై కేసీఆర్ పట్టు.. చేసేవి దొంగ ధర్నాలేనన్న ఈటల

Etela Rajender: టీఆర్ఎస్ మహాధర్నాపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. దేశం మొత్తంలో ఎక్కడా లేని సమస్య కేసీఆర్‌కు మాత్రమే ఎందుకొచ్చిందని ఈటల ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ తప్ప బియ్యం కొంటామని కేంద్రం చెబుతున్నా కేసీఆర్ మోసాల ధర్నా ఎందుకని ఈటల ప్రశ్నించారు. రైతులు కన్నీళ్లు పెడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు.

కేసీఆర్‌ అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యవస్తమైందన్న ఆయన అన్నీ తనకే తెలసునని అహంకారపూరితంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందని, వర్షాలకు తడిసి మొలక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story