Arvind Dharmapuri: దేశ వ్యాప్తంగా పసుపు పంట విస్తీర్ణం పెరిగింది

Arvind Dharmapuri: తెలంగాణలో మాత్రం పసుపు పంట విస్తీర్ణం తగ్గింది

Shekhar G
Published on: 24 Feb 2024 8:44 AM IST
BJP Meeting in Armoor Nizamabad District
X

Arvind Dharmapuri: దేశ వ్యాప్తంగా పసుపు పంట విస్తీర్ణం పెరిగింది

Arvind Dharmapuri: దేశవ్యాప్తంగా పసుపు పంట విస్తీర్ణం పెరిగినా... రాష్ట్రంలో మాత్రం తగ్గిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దీనికి కారణం మన రాష్ట్రంలోని లెబర్ ఛార్జీలన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆర్మూర్‌లో నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్రలకు పెట్టుబడిలో వ్యత్యాసంతోనే మన దగ్గర పసుపు పంట విస్తీర్ణం తగ్గిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల కాదని... కేవలం ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు. పెట్టుబడి తగ్గేలా సర్కార్ ఏం చేస్తోందో ప్రజలకు చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story