Nagarjuna Sagar: సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు

Nagarjuna Sagar By Elections 2021: కాసేపట్లో బీజేపీ కీలక సమావేశం‌

Sandeep Eggoju
Published on: 25 March 2021 3:05 PM IST
BJP Making Arrangements on the Selection of Candidate for Nagarjuna Sagar by Elections 2021
X
బీజేపీ (ఫైల్ ఫోటో)

Nagarjuna Sagar By Elections 2021: నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. కాసేపట్లో పార్టీ రాష్ట్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇప్పటికే జాతీయ నాయకులతో అభ్యర్థిపై చర్చించిన బండి సంజయ్ ఇవాళ రాష్ట్రంలోని సీనియర్ నేతలతో అభిప్రాయాలు తీసుకోనున్నారు. అయితే కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్, నివేదితా రెడ్డి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్‌ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. దీంతో అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తుందనే ఆసక్తి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story