బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరింపులకు.. గురి చేసి దాడులు చేస్తోందని ఆరోపణ

*యశోద హాస్పిటల్‌లో బీజేపీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి ప్రసన్నను... పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజ సింగ్

Rama Rao
Updated on: 24 Feb 2022 1:30 PM IST
BJP Legal Cell Spokesperson Prasanna at Yashoda Hospital BJP Leaders were Consulted
X

ప్రసన్నను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజ సింగ్

Telangana: కోర్టు ఆవరణలో టీఆర్ఎస్ కార్యకర్త దాడిలో గాయపడ్డ బీజేపీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి ప్రసన్నను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజా సింగ్ యశోద హాస్పిటల్‌లో పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి టీఆర్ఎస్ బెదిరింపులకు గురి చేస్తుందని విమర్శించారు. గతంలో కూడా ఇలానే చేసి ఆమెని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కేసులు పెట్టించి దోషులను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story