దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

Arun Chilukuri
Updated on: 10 Nov 2020 10:46 AM IST
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
X

హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో స్పష్టం కానుంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికి బీజేపీ 620 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌ జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story