దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

Arun Chilukuri
Updated on: 10 Nov 2020 10:38 AM IST
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
X

Dubbaka Results 2020 : హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో స్పష్టం కానుంది. దుబ్బాక ఉప ఎన్నికలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. మొత్తం 1453 పోస్టల్‌ బ్యాలెట్స్‌, 51 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. తొలిరౌండ్ కౌంటింగ్ పూర్తైంది. తొలిరౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story