రేపు భాగ్యలక్ష్మీ ఆలయానికి గెలిచిన గ్రేటర్ బీజేపీ అభ్యర్థులు

రేపు ఉదయం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ నేతలు వెళ్లనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్‌లతో పాటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ శ్రేణులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

admin
Published on: 5 Dec 2020 1:10 PM IST
రేపు భాగ్యలక్ష్మీ ఆలయానికి గెలిచిన గ్రేటర్ బీజేపీ అభ్యర్థులు
X

రేపు ఉదయం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ నేతలు వెళ్లనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్‌లతో పాటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ శ్రేణులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శనం అనంతరం అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు బండి సంజయ్. అటు నిన్న వెలువడిన గ్రేటర్ ఫలితాల్లో 150 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 149 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 55 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా, 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం, కాంగ్రెస్ రెండు చోట్లల్లో విజయం సాధించాయి.

admin

admin

Next Story