Hyderabad: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తల నినాదాలు

Hyderabad: భారత్‌మాతాకి జై, జై శ్రీరాం అంటూ నినాదాలు

Rama Rao
Published on: 29 April 2022 1:15 PM IST
BJP Leaders Slogans as Minister Vemula Prashanth Reddy Speaks
X

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తల నినాదాలు

Hyderabad: శంషాబాద్‌లో జరుగుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తల నినాదాలు చేశారు. భారత్ మాతాకి జై, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలను వారించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, నినాదాలు ఆపాలని హెచ్చరించారు. ఇది పద్ధతి కాదని సూచించారు. కిషన్ రెడ్డి జోక్యంతో కార్యకర్తలు నినాదాలు ఆపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగం మొదలుపెట్టారు.

Rama Rao

Rama Rao

Next Story