బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్‌శర్మపై సీఐ మల్లేష్ లాఠీఛార్జ్

X
Highlights
జనగామ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. కమిషనర్ అధికార పార్టీకి...
Arun Chilukuri12 Jan 2021 8:02 AM GMT
జనగామ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. కమిషనర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని వెంటనే కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 5న బండి సంజయ్ జనగామ పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను సిబ్బంది తొలగించింది. ఇవాళ వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించడాన్ని నిరసిస్తూ నిరసనకు దిగారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Web Titlebjp leaders protest near Warangal commissioner office
Next Story