ఎస్‌ఈసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

X
Highlights
ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు...
Arun Chilukuri30 Nov 2020 9:40 AM GMT
ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రఘునందన్ రావు అన్నారు. టీఆర్‌ఎస్ ఆగడాలపై ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
Web TitleBJP leaders protest near state election commission office
Next Story