జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఉద్రిక్తత

X
Highlights
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు వ్యతిరేకంగా...
Arun Chilukuri21 Jan 2021 12:15 PM GMT
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు. అయోధ్య పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నారని, అయోధ్య రామ మందిరానికి ప్రజలెవరూ విరాళాలు ఇవ్వొద్దన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కోరుట్ల, మెట్‌పల్లిలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో, బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ధర్నాకు దిగారు. ఇరువర్గాలు పెద్దఎత్తున చేరుకోవడంతో కోరుట్ల, మెట్‌పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Web TitleBJP Leaders Protest In Metpally
Next Story