జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

Jubilee Hills Police Station: హైదరాబాద్‌లోని ఆమ్మేషియా పబ్‌ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.

Arun Chilukuri
Published on: 3 Jun 2022 7:51 PM IST
BJP Leaders Protest At Jubilee Hills Police Station
X

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

Jubilee Hills Police Station: హైదరాబాద్‌లోని ఆమ్మేషియా పబ్‌ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. పబ్‌లో బాలికపై జరిగిన అత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిది. జూబ్లీహిల్స్ పీఎస్‌లోకి బీజేపీ శ్రేణులు దూసుకెళ్లారు. అత్యాచార కేసు నిందితులను పోలీసులు కాపాడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. పీఎస్‌లో బైఠాయించి బీజేపీ శ్రేణుల ఆందోళనకు దిగారు. నిందితులను శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story