Telangana BJP: సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేతలు

Telangana BJP: బీజేపీ నేతల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Rama Rao
Updated on: 9 March 2022 10:15 AM IST
Telangana BJP Leaders have Approached the High Court Over the Suspension | TS News Today
X

సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేతలు

Telangana BJP: సస్పెన్షన్‌పై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సస్పెన్షన్‌పై ఈటల రాజేందర్, రఘునందన్‌, రాజాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు బీజేపీ ఎమ్మెల్యేలు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించనుంది.

Rama Rao

Rama Rao

Next Story