నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట

Arun Chilukuri
Published on: 20 Dec 2020 5:08 PM IST
నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట
X

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బీజేపీలో అంతర్గత కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తార్నాకలోని నడిరోడ్డుపై బీజేపీ నాయకులు దుర్భాషలాడుతూ దాడులు చేసుకున్నారు. మెట్టుగూడ డివిజన్ బీజేపీ అభ్యర్థి శారద ఆమె భర్త మల్లేష్, భిక్షపతి, రామారావు, మల్లికార్జున్ కలిసి తార్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాము వర్మపై దాడికి పాల్పడ్డారు. పార్టీ పరువు తీశారని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ అధ్యక్షుడినే రోడ్డు మీద బట్టలు చిరిగేలా దాడి చేయడం దారుణమని కార్యకర్తలు అంటున్నారు.

శారదా మల్లేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు. తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్‌ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story